ముగిసిన మూడో విడుత నామినేషన్ల పరిశీలన


Sun,January 20, 2019 12:07 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : మూడోవిడుత నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియ శనివారం కొనసాగింది. నామినేషన్లు స్వీకరించిన ఆయా కేంద్రాల్లో నామినేషన్ల పత్రాలను అధికారులు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలో పరిశీలన కార్యక్రమం నిర్వహించిన అధికారులు నామినేషన్ దాఖలు పత్రాలను క్షుణంగా పరిశీలించారు. తూప్రాన్ మండలంలో మొత్తం 14 సర్పంచ్ స్థానాలకు గాను 86 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 62 నామినేషన్లను విలులైన నామినేషన్లుగా స్వీకరించారు. మిగిలిన వాటిని డబుల్ నామినేషన్లు లేక వివిధ కారణాలతో తిరస్కరించారు. 114 వార్డు సభ్యుల స్థానాలకు గాను 327 నామినేషన్లు దాఖలు కాగా ఇస్లాంపూర్ 8వ వార్డు నామినేషన్ తిరస్కరించగా సింగిల్ నామినేషన్ దాఖలుతో పాటు మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించగా 314 నామినేషన్లను విలువైన నామినేషన్లుగా గుర్తించారు. మనోహరాబాద్ మండలానికి చెందిన 17 సర్పంచ్ స్థానాలకు గాను 91 నామినేషన్లు దాఖలు కాగా 77 నామినేషన్లు, 148 వార్డు సభ్యుల స్థానాలకు గాను 485 దాఖలు కాగా 455 నామినేషన్లను విలువైన నామినేషన్లుగా అధికారులు గుర్తించారు.

పర్కిబండ సర్పంచ్ స్థానానికి మంచ నర్సింహులు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థికి ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్నాడని నామినేషన్ తిరస్కరించారు. రామాయంపేట మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయతీలు ఉండగా 110 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 74 నామినేషన్లను విలువైన నామినేషన్లుగా అధికారులు గుర్తించారు. 134 వార్డు స్థానాలు ఉండగా 418 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 385 నామినేషన్లు విలువైన నామినేషన్లుగా ప్రకటించారు. కాట్రియాల గ్రామానికి చెందిన మైలారం భిక్షపతి, మైలారం బుజ్జిల నామినేషన్లను ఇద్దరికంటూ ఎక్కుత సంతానం ఉందని వాటిని తిరస్కరించారు. నిజాంపేట మండలంలో 14 సర్పంచ్ స్థానాలు ఉండగా 123 నామినేషన్లు దాఖలు కాగా 80 నామినేషన్లు, 130 వార్డు స్థానాలకు గాను 380 నామినేషన్లు దాఖలు కాగా 358 నామినేషన్ విలువైన నామినేషన్లుగా అధికారులు ప్రకటించారు. నిజాంపేట సర్పంచ్ అభ్యర్థి పంజా నర్సమ్మ పేరు ఓటరు జాబితాలో లేక పోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు.

చేగుంట మండలంలో 28 సర్పంచ్ స్థానాలు ఉండగా 238 నామినేషన్లు దాఖలు కాగా 153 బరిలో ఉన్నారు. 813 వార్డుసభ్యుల నామినేషన్లు దాఖలు కాగా 663 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నార్సింగి మండలంలో 9 సర్పంచ్ స్థానాలు ఉండగా 83 నామినేషన్లు దాఖలు కాగా 61 నామినేషన్లు, 269 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు కాగా 248 నామినేషన్లు విలువైన నామినేషన్లుగా అధికారులు తెలిపారు.
ఆర్డీవోకు నేడు అప్పీలు....
నామినేషన్ల పరిశీలనలో భాగంగా తొలిగింపబడిన అభ్యర్థులు నేడు ఆదివారం 20వ తేదీన ఆర్డీవోకు అప్పీలు చేసుకునేందుకు సౌలభ్యం ఉంది. 21న సోమవారం అందిన అప్పీళ్లపై ఆర్డీవో విచారణ కొనసాగుతుంది. 22వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుంది. 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...