నేటితో మొదటి విడుత ప్రచారానికి తెర


Fri,January 18, 2019 11:42 PM

-సాయంత్రం 5 గంటల వరకు ముగియనున్న ప్రచారం
- 154 సర్పంచ్, 1364 వార్డు స్థానాలకు ఎన్నికలు
-32 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న ఆరు మండలాలకు సంబంధించి ప్రచారానికి నేటితో తెరపడనున్నది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాలు ముగియనున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పోలింగ్ 48 గంటల ముందు ప్రచారం పరిసమాప్తం కానున్నది. దీంతో మొదటి విడుతలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు, పాపన్నపేట, హవేళిఘనాపూర్, పెద్దశంకరంపేట మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఈ నెల 21న మొదటి విడుతలో 154 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 1364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ఇప్పటికే 32 గ్రామ పంచాయతీలు 415 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 122 సర్పంచ్ స్థానాలకు 313 మంది పోటీలో ఉన్నారు. 948 వార్డు స్థానాలకు 2066 అభ్యర్థులు బరిలో ఉన్నారు.

366
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...