ఎన్నికల నిబంధనలను పాటించాలి


Fri,January 18, 2019 11:40 PM

కొల్చారం: ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా సహకార శాఖాధికారి వెంకట్ అన్నారు. కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వామనరావు అధ్యక్షతన జరిగిన పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహకార శాఖాధికారి వెంకట్ మాట్లాడుతూ ప్రతి సర్పంచ్ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని తప్పకుండా పాటించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ గణేశ్ పాల్గొన్నారు.

రోజువారి లెక్కలను అప్పగించాలి
కౌడిపల్లి: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు రోజువారి ఖర్చులను రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని జిల్లా కోఆపరేట్ అధికారి వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉమ్మడి మండలంలో పంచాయతీలో ఎన్నికలో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీవో వెంకట్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటినుంచి ఎన్నికలు జరిగేంత వరకు రోజువారి లెక్కలను అప్పగించాలన్నారు. బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యుర్థులు రూ.1.50వేలు,వార్డు సభ్యులు రూ.30వేలు రూపాయల లోపే ఖర్చు చేయాలన్నారు. ఎన్నికలో అభ్యుర్థులు గెలిచినా, ఓడినా లెక్కలను రోజువారీగా తప్పకుండా రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారి కరుణశీలతో పాటు ఉమ్మడి మండలంలోని సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...