గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం


Fri,January 18, 2019 11:40 PM

పాపన్నపేట: గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించాలంటే టీఆర్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు మెంబర్లను గెలిపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ సూచించారు. ఆమె శుక్రవారం సాయంత్రం పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్, అన్నారం, అబ్లాపూర్, చీకోడ్, కొంపల్లి, లింగాయిపల్లి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించారని, అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు, మురుగుకాలువలు, ఏర్పాటుకు పెద్దపీట వేయనున్నారని ఆమె వెల్లడించారు. ఇతర పార్టీ అభ్యర్థులను సర్పంచ్ గెలిపిస్తే వారు ఊరు సమస్యలు వివరించలేరని, దీంతో ఆయా గ్రామాల సమస్యలు తీరక గ్రామాలు వెనుకబడే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ మండల శాఖ అధ్యక్షుడు పుల్లన్నగారి ప్రశాంత్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు తాడెపు సోములు, ఎల్లాపూర్ అభ్యర్థి వసంత, ఆ గ్రామ ఎంపీటీసీ బాలయ్య, మాజీ సర్పంచ్ దుర్గయ్య, గిర్ని ప్రభుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన నీరుడి సాయిలు అనే టీఆర్ కార్యకర్త ఇటీవల మృతి చెందగా శుక్రవారం సాయంత్రం పద్మాదేవేందర్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విష్ణువర్దన్ కుటుంబానికి...
ఏడుపాయల ఆలయ చైర్మన్ పట్లోళ్ల విష్ణువర్దన్ కుటుంబాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ శుక్రవారం రాత్రి పరామర్శించారు. విష్ణువర్దన్ తండ్రి కిష్టారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చైర్మన్ పాటు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆమె వెంట టీఆర్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ బాపురెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పుల్లన్నగారి మోహన్ పాపన్నపేట సర్పంచ్ గురుమార్తిగౌడ్ ఉన్నారు.

221
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...