అభివృద్ధి పనులను పరిశీలించిన గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి


Fri,January 18, 2019 11:39 PM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అధికారులను ఆదేశించారు. తూప్రాన్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. మండలంలోని అల్లాపూర్ టోల్ సమీపంలో జరుగుతున్న మార్కెట్ యార్డు, వే మార్కెట్ యార్డు నిర్మాణం పనులు, ఆర్ గెస్ట్ హౌస్ నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న పనులను త్వరితగతిన, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ఆయన ఆదేశించారు. పనులను పూర్తి చేయించడంలో సంబంధిత శాఖాధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గడ ఎంపీడీవో జయదేవ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

258
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...