టోల్ గేటు వద్ద అదుపు తప్పిన లారీ


Fri,January 18, 2019 12:33 AM

తూప్రాన్, నమస్తేతెలంగాణ : తూప్రాన్ టోల్ గేటు వద్ద లారీ అదుపు తప్పి . డివైడర్‌పైకి దూసుకెళ్లిన సంఘటన గురువారం తెల్లవారు జామున జరిగింది.వివరాల్లోకి వెళితే యూపీకి చెందిన లారీ టైల్స్ లోడుతో నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో తూప్రాన్ టోల్ గేటు వద్ద డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో టోల్ వసూలు కార్మికులు విధుల్లోనే ఉన్నారు.ఎవ్వరికి ఎటువంటి ప్రాణాపాయం జరుగలేదు.లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు గురువారం ఉదయం లారీని డివైడర్ పై నుంచి తొలిగించారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...