170 పంచాయతీలకు 38 మంది ఏకగ్రీవం


Fri,January 18, 2019 12:32 AM

నర్సాపూర్, నమస్తేతెలంగాణ : జిల్లాలో ఈ నెల 25న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నర్సాపూర్ డివిజన్‌లోని 5 మండలాలతో పాటు వెల్దుర్తి మండలంలో కలిపి 170 పంచాయతీలకు 1444 వార్డు సభ్యులకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా 38 గ్రామాల్లో ఏకగ్రీవమయ్యారు. దాంతో 132 గ్రామ పంచయతీలకు ఈ నెల 25న రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. నర్సాపూర్ మండలంలో 9 గ్రామ పంచాయతీలు, శివ్వంపేట మండలంలో 11 గ్రామ పంచాయతీలు, కౌడిపల్లి మండలంలో 10 గ్రామ పంచాయతీలు, చిలిపిచెడ్ మండలంలో 4 గ్రామ పంచాయతీలు, వెల్దుర్తి మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అయితే శివ్వంపేట మండలంలో 26 పంచాయతీలకు 70 మంది సర్పంచ్ అభ్యర్థులు, 226 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. కొల్చారం మండలంలో 21 గ్రామ పంచాయతీలకు 57 మంది సర్పంచ్ అభ్యర్థులు 397 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. వెల్దుర్తి మండలంలో 25 గ్రామ పంచాయతీలకు 82 మంది సర్పంచ్ అభ్యర్థులు 512 మంది వార్డు సభ్యులకు బరిలో ఉన్నారు. చిలిపిచెడ్ మండలంలో 14 గ్రామ పంచాయతీలకు 33 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 48 వార్డులు ఏకగ్రీవం కాగా 224 మంది బరిలో ఉన్నారు. కౌడిపల్లి మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు 42 మంది సర్పంచ్‌అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 107 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా 286 మంది బరిలో ఉన్నారు. నర్సాపూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు 66 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 104 వార్డులు ఎకగ్రీవం కాగా 406 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నట్లు ఎంపీడీవో శ్రావణ్ కుమార్ తెలిపారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...