తుది విడుత.. నామినేషన్లు షురూ..


Thu,January 17, 2019 01:18 AM

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లాలో మూడవ విడుతలో జరిగే 8 మండలాల సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి ఆయా మండల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను నామినేషన్లు వేసేందుకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. 8 మండలాలకు సంబంధించి 145 గ్రామ పంచాయతీలకు, 1278 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడో విడుతలో తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 138 దాఖలు కాగా, వార్డు స్థానాలకు 461 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

తూప్రాన్, నమస్తేతెలంగాణ : మూడో విడుత ఎన్నికల్లో భాగంగా తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో తూప్రాన్, మనోహారాబాద్ మండలాల గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలయ్యాయి. ఘన్‌పూర్, వెంకటరత్నాపూర్ గ్రామాల నుంచి నామినేషన్‌లు దాఖలు కాగా మనోహరాబాద్ మండలం నుంచి కోనాయిపల్లి పీటీ, కూచారం, చెట్లగౌరారం వంటి గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు కార్యాలయానికి వచ్చారు. వీరికి మద్దతు దారులు రావడంతో జనసందోహంగా మారింది.

అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు చేశాం..
- శ్యాంప్రసాద్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి
నామినేషన్ దాఖలు చేసే కేంద్రాల వద్ద పోటీ చేసే అభ్యర్తులకు అవసరమయ్యే పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. గ్రామ పంచాయతీల వారీగా అభ్యర్థులు పొందాల్సిన ఎన్‌వోసీ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇక్కడే సమర్పించే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎప్పటికప్పుడు నామినేషన్ దాఖలు కేంద్రాలతో పాటు సహాయ కేంద్రాలను కూడా పర్యవేక్షిస్తున్నాం.

బారీ కేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు భారీగా వస్తారని గుర్తించి పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సీఐ లింగేశ్వర్‌రావు సమీక్షలో ఎస్సైలు, సుభాశ్, ఎల్లయ్యగౌడ్, వరప్రసాద్‌లతో పాటు సిబ్బంది గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. వాహనాలు లోపలికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తలేదని చెప్పాలి. నామినేషన్ దాఖలు చేసే వారితో పాటు అవసరమైన వారిని మాత్రమే కేంద్రాల్లోకి పంపించారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...