పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం


Thu,January 17, 2019 01:15 AM

టేక్మాల్: తొలి విడుత జరుగనున్న ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన టేక్మాల్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడుతగా ఆరు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీన జరుగనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని ఇప్పటికే సమకూర్చడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల వారీగా అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశామన్నారు. ఓటరు స్లిప్పులను సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను రోజు వారీగా ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో శైలేష్, ఎస్సై సందీప్‌రెడ్డి, అధికారులు విష్ణువర్ధన్, హన్మంత్‌రెడ్డి, చంద్రశేఖర్, సత్యనారాయణ, మాధవాచార్యులు, దుర్గయ్య ఉన్నారు.

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...