కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ


Thu,January 17, 2019 01:14 AM

వెల్దుర్తి: నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా బుధవారం 15 నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు సహాయ ఎన్నికల అధికారి కృష్ణన్ తెలిపారు. మండలంలోని 30 గ్రామ పంచాయతీలు, 260 వార్డు స్థానాలు ఉండగా సర్పంచ్ స్థానాలకు 129 నామినేషన్లు వేయగా, వార్డు స్థానాలకు 623 మంది నామినేషన్లు వేశారన్నారు. వార్డు సభ్యుల నామినేషన్లలో ఒక్కటి తిరస్కరణకు గురికాగా 622 మంది నామినేషన్లు ఆమోదం పొందాయన్నారు. ఆమోదం పొందిన నామినేషన్లు దాఖలు వేసిన అభ్యర్థుల జాబితాలను స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేశామన్నారు. కాగా ఉపసంహరణలో భాగంగా మొదటి రోజైన బుధవారం 8 సర్పంచ్ నామినేషన్లు, 7 వార్డు సభ్యుల నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారని, నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజని, మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని, తదనంతరం సాయంత్రం పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి గుర్తులను కేటాయించన్నట్లు పేర్కొన్నారు.

కౌడిపల్లి మండలంలో 8సర్పంచుల,
7వార్డు సభ్యుల స్థానాలకు ఉపసంహరణ
కౌడిపల్లి: కౌడిపల్లి మండలంలో 29గ్రామ పంచాయతీలకు గాను మొత్తం 122 సర్పంచుల, 476వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచుల అభ్యర్థులు 8మంది, వార్డు సభ్యులకు 7మంది ఉపసంహరించుకున్నారు. అలాగే చిలిపిచెడ్ మండలంలో సర్పంచు స్థానాలకు 12మంది, వార్డు సభ్యుల స్థానాలకు 6మంది ఉపసంహరించుకున్నారని మండల ఎన్నికల అధికారి కరుణశీల తెలిపారు.

నర్సాపూర్, నమస్తేతెలంగాణ: నర్సాపూర్ మండలంలో 34 పంచాయతీలకు 123 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేయగా ఇందులో 6 గ్రామపంచాయతీలకు సింగిల్ నామినేషన్ వచ్చాయి. వార్డు సభ్యుల కోసం 555 మంది నామినేషన్ వేయగా 89 వార్డులకు సింగిల్ నామినేషన్ వచ్చాయి. మంగళవారం 5 మంది సర్పంచు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. అలాగే 13 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బుధవారం సర్పంచ్ స్థానాలకు 19 మంది, వార్డు సభ్యులకు 15 మంది తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నట్లు ఎంపీడీవో శ్రవణ్‌కుమార్ తెలిపారు.

శివ్వంపేట: మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల సర్పంచ్, ఆయా గ్రామాల వార్డు స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి వచ్చిన నామినేషన్లను ఉప సంహరించుకోవడానికి కొంత మంది అభ్యర్థులు ముందుకు వచ్చారు. మండల పరిధిలోని దంతాన్‌పల్లి నుంచి సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు రాగా బుధవారం ఒక నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. మండల వ్యాప్తంగా వార్డు స్థానాలకు 12 నామినేషన్లను తొలిగించుకున్నారని ఎంపీడీవో కాసం నవీన్‌కుమార్ తెలిపారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...