ఉల్లాసంగా.. ఉత్సాహంగా


Thu,January 17, 2019 01:14 AM

హవేళిఘనపూర్ : మెదక్ - నిజామాబాద్ జిల్లా సరిహద్దు పోచారం డ్యామ్ అభయారణ్యం వద్ద బుధవారం పర్యాటకులు ఉల్లాసంగా... ఉత్సాహంగా గడిపారు. సంక్రాంతి సెలవు దినాలు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు కావడంతో జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వివిధ వాహనాల్లో కుటుంబీకులతో తరలివచ్చి పోచారం అభయారణ్యం గెస్ట్‌హౌస్ ఆవరణలో సేదదీరారు. దీంతో అక్కడ పర్యాటకుల రద్దీ పెరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పోచారం డ్యామ్, అభయారణ్యం వద్ద పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పించడంతో ఈ ప్రాంతానికి రోజు రోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. పర్యాటకులు వచ్చి అభయారణ్యంలో ఉన్న జింకకు పండ్లు వేస్తూ పిల్లలు ఆటలాడుతూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

214
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...