డివిజన్ 25 పంచాయతీలు ఏకగ్రీవం


Mon,January 14, 2019 12:37 AM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో రెండో విడుతలో భాగంగా ఆదివారం సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్ దాఖల పర్వం ముగిసింది. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో కొల్చారం మినహా 25 గ్రామాల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైనట్లు తెలిసింది. అత్యధికంగా శివ్వంపేటలో మొత్తం 37 గ్రామపంచాయతీలు ఉండగా 10 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలయ్యాయి. అత్యల్పంగా చిలిపిచెడ్ మండలంలో మూడు గ్రామాల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైనట్లు సమాచారం. మండలంలో సీతారాం తండ, పోతులబోగూడ, రత్నాపూర్, దంతాన్ ఏదుల్లాపూర్, కొత్తపేట, రూప్లాతండ, రెడ్యాతండ, బోజ్యాతండ, లచ్చిరెడ్డిగూడెం, కౌడిపల్లి మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉండగా 8 గ్రామపంచాయతీలకు ఒక్కటి చొప్పున నామినేషన్ వేశారు. కూకుట్లపల్లి, బూర్గుగడ్డ, మహ్మద్ రాయిలాపూర్, ధర్మసాగర్, శేరితండ, మనంతాయిపల్లితండ, మర్రిచెట్టుతండా, నర్సాపూర్ మండలంలో మొత్తం 34 గ్రామపంచాయతీలు ఉండగా 4 పంచాయతీలు ఎకగ్రీవం అయ్యాయి. అచ్చంపేట, గూడెంగడ్డ, తుల్జారాంపేట్, ఏల్లారెడ్డిగూడతతాండ, చిలిపిచెడ్ మండలంలో మొత్తం 12 గ్రామపంచాయతీలు ఉండగా 3 పంచాయతీలు ఎకగ్రీవం అయ్యాయి. గుజ్రూతండ, టోప్యాతండ, రహాంగూడ తండలు ఉన్నాయి. -
శివ్వంపేట మండలంలో
10 ఏకగ్రీవాలు
శివ్వంపేట:మండలంలో మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ పది గ్రామాలల్లో కేవలం ఒకరు మాత్రమే వారి యొక్క నామినేషన్లను దాఖలు చేశారు. 1. లచ్చిరెడ్డిగూ డెం నుంచి శ్రీనివాస్ 2. సీతా రం తండా బానోతు సోని, 3. పోతులబోగూడ హరికిషన్ 4. రత్నాపూర్ బోగ్గుల సాలమ్మ, 5. దంతాన్ దుర్గేశ్, 6. ఎదుల్లాపూర్ కల్లూరి కీర్తన హన్మంత్ 7. కొత్తపేట రేవ సాన్వి రమాకాంత్ 8. రూప్లాతండా మాలోతు మోతి, 9. రెడ్డ్యాతండా ఆంజనేయులు, 10. బోజ్జ్యతండా బానోతు రాజులు ఓకే నామినేషన్ వేశారు, వీరందరు స్క్రూట్ని తర్వాత ఈనెల 17 అధికారికంగా సర్పంచ్ కానున్నారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...