మండలంలో 8 గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం


Mon,January 14, 2019 12:37 AM

-విత్ అనంతరం అధికారికంగా ప్రకటన చేయనున్న అధికారులు
-ఉపసంహరణ సమయం వరకు మరిన్ని ఏకగ్రీవం అయ్యే చాన్స్?
కౌడిపల్లి: మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ పోరులో 8 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పాటు వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ. 10లక్షల నిధులను గ్రామాభివృద్ధికి మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. సీఎం మాటపై నమ్మకం పెట్టుకున్న ప్రజలు మండలంలోని 8 గ్రామ పంచాయితీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని మండలంలోనే ఆదర్శంగా నిలిచారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో కౌడిపల్లి మండలంలో కూకుట్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా చంగల్వ సుజాతకాంతారావుతో పాటు మరో 8వార్డు సభ్యులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే బూరుగడ్డలో సర్పంచ్ అభ్యర్థిగా తాటి అంజమ్మ నర్సింహులుతో పాటు మరో 8మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహ్మద్ సర్పంచ్ అభ్యర్థిగా బాన్సువాడ దివ్య మైహిపాల్ పాటు మరో 10మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అలాగే రాయిలాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా కురుమ శేఖులుతో పాటు 8మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అలాగే ధర్మసాగర్ సర్పంచ్ అభ్యర్థిగా శాగ ఆశమ్మతో పాటు 8మంది వార్డు సభ్యులకు నామినేషన్లు వేశారు. అలాగే శేరితండాలో సర్పంచ్ రాజునాయక్ పాటు 8మంది వార్డు సభ్యులు, మనంతాయిపల్లి తండాలో సర్పంచ్ పాత్లోత్ జీవ్లానాయక్ పాటు మరో 8మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అలాగే మర్రిచెట్టుతండా సర్పంచ్ కాట్రోత్ బుజ్జితో పాటు మరో 8మంది వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. ఈ 8గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు అభ్యర్థులు ఒకరే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నామినేషన్ ఉపసంహరణ అనంతరం మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని నాయకులు చెబుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఏకగ్రీవ సర్పంచులను అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.

320
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...