డివిజన్ సర్పంచులకు 199 నామినేషన్లు


Sun,January 13, 2019 12:11 AM

నర్సాపూర్, నమస్తేతెలంగాణ: డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లో రెండోవిడుతలో భాగంగా శనివారం రెండో రోజూ సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సాపూర్ డివిజన్ పరిధిలోని 6 మండలాలలో సర్పంచ్ స్థానాలకు 199 మంది నామినేషన్లు వేయగా వార్డు సభ్యుల కోసం 1008 మంది నామినేషన్లు వేశారు. కొల్చారం మండలంలో సర్పంచ్ స్థానానికి 30 మంది నామినేషన్లు, వార్డు సభ్యుల కోసం 170 మంది నామినేషన్లు వేశారు. అలాగే మండలంలో ఆయా గ్రామాల సర్పంచ్ స్థానాలకు 33మంది, వార్డు సభ్యుల కోసం 123 మంది నామినేషన్లు వేశారు. శివ్వంపేట మండలంలో సర్పంచ్ అభ్యర్థులు 38 మంది, వార్డు సభ్యుల కోసం 223 మంది నామినేషన్లు వేశారు. అలాగే చిలిపిచెడ్ మండలంలో సర్పంచుల కోసం 20 మంది , వార్డు సభ్యులకు 78మంది నామినేషన్లు వేశారు. వెల్దుర్తి మండలంలో సర్పంచుల కోసం 43, వార్డు సభ్యుల కోసం 248 మం ది నామినేషన్లు వేశారు. నర్సాపూర్ మండలంలో రెండోరోజూ సర్పంచ్ స్ధానాలకు 35 మంది , వార్డు సభ్యుల కోసం 166 మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో శ్రవణ్ తెలిపారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలలో కలిపి సర్పంచ్ స్థానాలకు 400 మంది , వార్డు సభ్యులకు 1554 మంది నామినేషన్లు వేశారు.

269
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...