వివేకానందుడి సూక్తులు దేశానికే ఆదర్శం


Sun,January 13, 2019 12:08 AM

మెదక్, నమస్తే తెలంగాణ: ఆధ్యాత్మిక చింతకుడు, యువతకు దిశానిర్దేశకులు స్వామి వివేకానంద అని సామాజిక సమరసత వేదిక ఉమ్మడి జిల్లా కార్యదర్శి మశ్చేంద్రనాథ్ అన్నారు. వివేకానంద జయంతి పురస్కరించుకుని సమరసత ఆధ్వర్యంలో శనివారం రాందాస్ చౌరస్తాలో వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేశం, సమరసతవేదిక జిల్లా అధ్యక్షుడు రవి, మండల కన్వీనర్ సాయిబాబా, బాధ్యులు ప్రసాద్ అంజయ్య, కాశీనాథ్, వెంకటేశం, రాజు, రామారావు, అశోక్, రవీందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మండలంలో..
వివేకానంద జయంతి పురస్కరించుకుని మండలం బాలానగర్ సమరసత వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో వేదిక మండల కన్వీనర్ సాయిబాబాతో పాటు శివ, వికాస్, సంతోశ్, కిషన్, రాందాస్ పాల్గొన్నారు
నర్సాపూర్,నమస్తేతెలంగాణ: వివేకానందుడి సూక్తులు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎల్లంకిడిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వామివివేకానంద జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ హాజరైన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వావిలాల అశోక్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సంధీప్, లెక్చరర్స్ హనుమంతు, జాని, అనీల్, రాజేశ్వరి, రయ్య, భూలక్ష్మి, సోమలింగం తదితరులు ఉన్నారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...