వివేకానందుడి జీవితం ఆదర్శనీయం


Sun,January 13, 2019 12:07 AM

పెద్దశంకరంపేట: వివేకానందుడి జీవితం యువతకు ఎంతో ఆదర్శమని ఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శనివారం పేటలోని బస్టాండువద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివేకానందుడి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషిచేయాలన్నారు. దేశ యువతను ప్రగతిపథంలో ముందుకు నడిపించి నవజాతి నిర్మాణానికి పునాది వేసిన వ్యక్తి వివేకానందుడన్నారు. అంతకు ముందు ఆర్వీఎస్ స్వచ్ఛందసంస్థ, శిశుమందిర్ ఆధ్వర్యంలో వివేకానందుడికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీఆర్ మండల అధ్యక్షుడు జంగం శ్రీనివాస్, మండల రైతుసమితి అధ్యక్షుడు సురేశ్ మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు మురళీపంతులు, జంగం రాఘవులు, సత్యం, ప్రధానాచార్యులు వీరప్ప, ఆర్వీఎస్ స్వచ్ఛంద సంస్థ బాధ్యులు గంగారెడ్డి, బీంలా, సంగమేశ్, రాందాస్, నాగరాజు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...