సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి


Sun,January 13, 2019 12:07 AM

శివ్వంపేట: ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధంగా అభ్యర్థులు ప్రవర్తించకూడదని మెదక్, మేడ్చల్ జిల్లాల ఎన్నికల పరిశీలకులు కిషన్ పేర్కొన్నారు. శనివారం శివ్వంపేట ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పలు రికార్డులు, నామినేషన్ల కౌంటర్లు పరిశీలించారు. ఆతర్వాత ఎన్నికల అధికారి కిషన్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఎంపీడీవో కాసం నవీన్ సూచించారు. ఏకగ్రీవంలపై విచారణ జరుపుతామని, ఏదైన ఆర్థిక లావాదేవిలతో ఏకగ్రీవం అయ్యాయా, నిజంగా గ్రామంలో ప్రజలందరూ ఆమోదించారా అనే విషయాలను తమ విచారణతో తెలుసుకుంటామన్నారు. అదేవిధంగా పోటీలో ఉన్న అభ్యర్థులందరూ రోజువారీ ఖర్చుల వివరాలను రిజిస్ట్రార్ల వారీగా నమోదు చేయించాలన్నారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ భానుప్రకాశ్, ఎంపీడీవో నవీన్, మండల పరిషత్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...