అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలుపునకు పునాది


Thu,September 13, 2018 12:03 AM

వెల్దుర్తి: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు పునాది అని నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామంతాపూర్‌లో బుధవారం ప్రచారం ప్రారంభించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాని అభివృద్ధిని నాలుగేండ్లకాలంలో రాష్ట్ర ప్రజలు చూశారని, అన్ని వర్గాలకు చేరుతున్న ప్రభుత్వ పథకాలతో వారి కండ్లలో ఆనందం కనిపిస్తున్నదన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వారికి ప్రజా కోర్టులోనే శిక్ష విధించాలని తలచిన కేసీఆర్ ఎన్నికలకు తెరతీశారన్నారు. దీంతో తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్ట కట్టనున్నారని, ఎన్నికల అనంతరం ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం ఉన్నంత వరకు శక్తి మేర కృషి చేస్తానని, తనకు నమ్మకం ఉంచి, మరోసారి అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్నారు. ఇప్పటికే నియోజకరవ్గంలో ఎంతో అభివృద్ధి పనులను చేశానని, నర్సాపూర్‌లో బస్‌డిపో ఏర్పాటు,

నర్సాపూర్-వెల్దుర్తి-తూప్రాన్ రెండు వరుసల రోడ్డు, మంజీరాపై 7, హాల్దీపై 3 చెక్ డ్యాంల మంజూరు, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నియోజకవర్గంలోని గిరిజనతాండాలలో సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణం కోసం రూ. 54 కోట్ల నిధుల మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలను తెలుసుకొని వాటిని సేకరించాలని కేసీఆర్ చూచించారని, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్లు తెలిపారన్నారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించానని, ప్రతి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన 30 పడకల దవాఖానగా చేయడం, అన్ని చెరువులు, కుంటలను కాలువల ద్వారా లిఫ్టులను పెట్టి గోలుసుకట్టు ద్వారా నింపడానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో డీసీసీబి అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అనంతరెడ్డి, గోపినాయక్, శంకర్‌గౌడ్, అశోక్‌గౌడ్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...