లక్ష మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తాం


Tue,September 11, 2018 11:17 PM

రామాయంపేట: దుర్గాదేవి సన్నిధిలో ఎన్నికల ప్రచారన్ని ప్రారంభించనున్న మాజీ ఉప సభాసతి పద్మాదేవేందర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, ఆత్మకమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, పుట్టి యాదగిరి, సరాఫ్ యాదగిరి, జితేందర్‌గౌడ్‌లు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పీఎన్‌ఆర్ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మెదక్ నియోజకవర్గంలో పద్మాదేవేందర్‌రెడ్డి విజయాన్ని ఎవ్వరు ఆపలేరన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలాల నుంచి రెండు వందల బైకులతో దుర్గాదేవి సన్నిధికి తరలివెళ్తామని అన్నారు. అమెరికా దొంగ వీసా కేసులో హస్తం ఉన్న జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో బాదె చంద్రం, కొండల్‌రెడ్డి, లంబాడీ భిక్షపతి, అశోక్, ఐలయ్య, నవాత్ కిరణ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...