జిల్లాలో జోరుగా కంటివెలుగు


Tue,September 11, 2018 02:39 AM

మెదక్ మున్సిపాలిటీ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మెదక్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. కంటి వెలుగు శిబిరాలకు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు తరలివస్తున్నారు. శిబిరాల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంటివెలుగు కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలతో పాటు కండ్ల అద్దాలు సైతం అందిస్తుండడంతో ప్రజల కండ్లలో ఆనందం వ్యక్తమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కండ్ల అద్దాలు ఇవ్వడంతో శిబిరాల వద్ద కంటి పరీక్షల కోసం పిల్లల నుంచి వృద్ధుల వరకు క్యూ కడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 క్యాంపుల్లో సోమవారం రాత్రి 6 గంటల వరకు 3,507 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించగా, 65 మందికి కండ్లఅద్దాలను పంపిణీ చేశారు. 128 మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 17 రోజులుగా 63,899 మందికి కంటి పరీక్షలు చేయగా, 7,751 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 4,916 మందికి కంటి ఆపరేషన్ల కోసం రెఫర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 20 బృందాలు పాల్గొనగా, ప్రతి బృందంలో మెడికల్ అధికారితో పాటు 10 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.

165
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...