అభివృద్ధి, ఆత్మగౌరవమే నినాదం


Sun,September 9, 2018 11:34 PM

అందోల్, నమస్తే తెలంగాణ/టేక్మాల్ : అందోల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ పర్యటనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి క్రాంతి కిరణ్ నియోజకవర్గంలోని మండలాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్ మండలంలోని బొడ్మట్‌పల్లిలో భద్రకాళీసమేత వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలను చేపట్టారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, యవకులు, క్రాంతి సేన సభ్యులు, జాగృతి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముస్లాపూర్ నుంచి బొడ్మట్‌పల్లి వరకు యువకులు భారీగా బైకు ర్యాలీని నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు సమర్పించి , ఘన నివాళులర్పించారు. అనంతరం ఆలయం వద్ద కమిటీ సభ్యులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. అక్కడున్న వాళ్లందరినీ అప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. అనంతరం అందోల్ మండల పరిధిలోని తాలెల్మలోని సీనియర్ నాయకుడు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగాగౌడ్ ఇంటికి వెళ్లి, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రచారంపై, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు సంబంధించిన అంశాలపై కొద్దిసేపు చర్చించారు. ఆయనతో పాటు జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ.నాగభూషణం, జాగృతి రాష్ట్ర కార్యదర్శి మర్వెల్లి భిక్షపతి, నాయకులు వీరప్ప, సంగమేశ్వర్‌గౌడ్, శివకుమార్, శ్రీనివాస్ యాదవ్, గాజుల అనీల్, ఎండీ.ఫైజల్, నాగరాజ్, భిక్షపతి, భాస్కర్, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, ఆరీఫ్, దశరత్‌గౌడ్, గంగయ్య, సాయిబాబు, మహేశ్, మాణిక్యం, సాయితో పాటు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

ఆత్మగౌరవ కమిటీ సభ్యులకు ఘన సన్మానం...
అందోల్ నియోజకవర్గ ఆత్మగౌరవ కమిటీ పేరుతో స్థానిక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కమిటీ సభ్యులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం జోగిపేటలోని హౌజింగ్ బోర్డులోని ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ డి.వీరభద్రరావు ఇంటికివెళ్లి కలిశారు. స్థానిక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సీఎం కేసీఆర్ అందోల్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో స్థానికుడైన తనకు టీఆర్‌ఎస్ శాసనసభ అభ్యర్థిగా టికెట్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. మీ అందరి సహకారంతోనే టికెట్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సహకరించాలని క్రాంతి కిరణ్ విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ డి.వీరభద్రరావు, మాజీ వార్డు సభ్యుడు వంశీ కృష్ణలతో పాటు పలువురికి శాలువాలను కప్పి ఘనంగా సత్కరించారు. ఆత్మగౌరవ కమిటీ ఏర్పాటు స్థానిక నాయకత్వాన్ని బలపర్చడం కోసమేనని, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మా అందోల్ నియోజకవర్గ ప్రజల బాధలను అర్థంచేసుకుని స్థానికుడికే టికెట్‌ను కేటాయించడం సంతోషకరమని ఆత్మగౌరవ కమిటీ కన్వీనర్ డి.వీరభద్ర రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకుడైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్‌ను భారీ మేజార్టీతో గెలిపించేందుకు తమ వంతు కృషి ఉంటుందని, తప్పనిసరిగా గెలిపించి తీరుతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

256
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...