సింగూర్ నీటి విడుదల


Sun,September 9, 2018 11:33 PM

పుల్కల్ : సింగూర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం దిగువన ఉన్న మంజీరా బ్యారేజీలోకి 0.3టీఎంసీల నీటిని వదిలారు. డ్యాం 6,7నంబర్ గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. రాత్రి వరకు ఈ గేట్లను ఎత్తి దిగువకు 0.3టీఎంసీల నీటిని మంజీరా బ్యారేజీలోకి వదులుతున్నామని నీటి పారుదల డీఈఈ బాలగణేశ్ తెలిపారు. మంజీరా బ్యారేజీలో నీరు తగ్గినప్పుడల్లా సింగూర్ డ్యాం నుంచి నీటిని వదులుతారు. మంజీరా బ్యారేజీ నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీ, పటన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి పట్టణాలకు తాగునీటిని ప్రతి రోజూ సరఫరా చేస్తారు. ఈసారి వానకాలంలో వానలు కురియకపోవడం వల్ల మంజీరా బ్యారేజీలో నీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రతీ రెండునెలలకోసారి సింగూర్ నుంచి 0.3టీఎంసీలు (మూడున్నర వేల క్యూసెక్కులు) దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సింగూర్ 7.5టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
పర్యాటకుల సందడి
సింగూర్ ప్రాజెక్టుకు ప్రతి ఆదివారం పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డితో పాటు జంటనగరాల నుంచి ప్రజలు సింగూర్ ప్రాజెక్టుకు వచ్చి సేద తీరుతుంటారు. ఆదివారం సాయంత్రం రెండు గేట్లు ఎత్తారు. దీంతో పర్యాటకులు పొంగిపొర్లుతున్న నీటినిచూసి ఆనందంతో పులకరించారు.

265
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...