డిపాజిట్ల కోసమే ప్రతిపక్షాల ఆరాటం


Sun,September 9, 2018 11:33 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: తెలంగాణ వ్యతిరేక శక్తులుగా ప్రజల ముందు దోషులుగా నిలబడ్డ పార్టీలు కలిసి తెలంగాణను ఉద్ధరిస్తామని ఎన్నికల్లోకి వెళ్లడం విడ్డూరంగా ఉందని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోని అన్నివర్గాలు పాల్గొంటే టీడీపీ ఆంధ్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యతిరేకించిందని ఆ పార్టీ నాయకులు సైతం మౌనం వహించారన్నారు. అనేక దశాబ్దాలుగా తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగిన కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక మంది తెలంగాణ వాదులను పొట్టన పెట్టుకుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెలంగాణను మరోసారి మోసం చేయడానికి అధికారం కోసం ఆరాటపడుతున్నాయన్నారు. ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి పూర్తయ్యే దశలో ఉన్నాయని, అవి పూర్తయితే ఆంధ్రకు దీటుగా ఐదేండ్లలోనే తెలంగాణ అన్నపూర్ణగా మారుతుందన్నారు. పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే దేశంలోనే ముందు స్థానంలో నిలిచిందని, మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో కూడా కేసీఆర్ కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు దుర్గయ్య, బెండెమధు, నాయకులు పాలరమేశ్, ఇస్మాయిల్, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...