తప్పులను సరిచేయాలి..


Sun,September 9, 2018 11:33 PM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: బూత్‌లెవర్ అధికారులు పారదర్శకంగా పనిచేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాలులో రాబోయే ఎన్నికలపై నర్సాపూర్ నియోజకవర్గ బూత్‌లెవల్ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్ఠ్యా ఓటరుకార్డులో పేర్లు, వయస్సు, ఫొటోల తప్పులను సరిచేయడానికి ఫాం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఐపీల పేర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు ఓటరు లిస్టులో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. పాత ఫొటోలతో ఉన్న గుర్తింపు కార్డుదారుల జాబితాను తయారు చేయాలని అన్నారు. సమావేశంలో నర్సాపూర్ ఆర్డీవో వెంకటేశ్వర్లు, తూప్రాన్ ఆర్డీవోతో పాటు తహసీల్దార్లు సత్తార్, మనోహర్ చక్రవర్తి, బలరాంనాయక్, సాదత్ అలితో పాటు నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, కొల్చారం, హత్నూర, వెల్దుర్తి, చిలిపిచెడ్ మండలాల బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...