అందరి ఆదరణతో మళ్లీ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయం


Sun,September 9, 2018 12:26 AM

కల్హేర్ : సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్ది భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఖానాపూర్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మోహన్‌సాగర్, కార్యకర్తలు ప్రశాంత్‌సాగర్‌తో పాటు పలువురు భూపాల్‌రెడ్డి సమక్ష్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాలించిన పాలకులు చేపట్టలేని అభివృద్ధి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పయనిస్తూ మంత్రి హరీశ్‌రావు సహాయ సహకారాలతో నియోజకవర్గంలో అభివృద్ధిని సాధించామన్నారు. రానున్న రోజుల్లో రైతులను రాజులుగా తీర్చాడానికి మహోన్నతమైన ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో యువనాయకుడు మహారెడ్డి రోషన్‌రెడ్డి, ఆర్‌ఎస్‌డీసీవో వెంకట్‌రాంరెడ్డి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు వెంకటేశంగుప్తా, కడ్పల్ మాజీ ఎంపీటీసీ రాఘవరెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు.

173
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...