ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయను


Sun,September 9, 2018 12:25 AM

హుస్నాబాద్‌టౌన్: ఈ ప్రాంత ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని హుస్నాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ చెప్పారు. శనివారం హుస్నాబాద్ టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.5,200కోట్లతో రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పనులను చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేశానన్నారు. లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు గానూ 11విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేయించడమే కాకుండా ఇండ్లపై, వ్యవసాయ భూముల్లో విద్యుత్ లూజ్‌లైన్లను సరిచేయించి, వందలాది అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం ఏర్పాటు చేయించి కరెంట్ బాధలు తీర్చినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 64వేలమంది రైతులకు రైతుబంధ పథకం కింద డబ్బులను అందించి, అర్హత ఉన్న రైతులకు రైతుబీమాను కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరందించేందుకు గానూ సీఎం కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్‌ను స్వయంగా పరిశీలించి దాని సామర్థ్యాన్ని 1.4టీఎంసీ నుంచి 8.2టీఎంసీకి పెంచడం, మహాసముద్రం గండి పనులను పూర్తిచేయించడంతో భూగర్భజలాలు పెరిగాయని చెప్పారు.

గౌరవెల్లి రిజర్వాయర్‌లో ఇండ్లుకోల్పోయిన వారికి రూ.93కోట్లు సైతం అందించామని, శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు రూ.23కోట్లు, సింగరాయ ప్రాజెక్టుకు రూ.6కోట్లు కేటాయించడమే కాకుండా పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దుచేసి 1,400ఎకరాల భూమిని తిరిగి రైతులకే అప్పగించే సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వరంగల్‌అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తున్నామని, రూ. 2.16కోట్లతో హరిత హోటల్ నిర్మాణ పనులు సైతం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో నూతనంగా 40 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కోరడంతో మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ రూ. 20కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావులు కృషిచేశారని చెప్పారు.

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశ్వీరాదస సభకు వేలాది మంది హాజరై విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. సభకు హాజరై అశ్వీరదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, కరీంనగర్ జడ్పీవైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, చిగురుమామిడి జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్, హుస్నాబాద్‌టౌన్, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి మండల టీఆర్‌ఎస్ పార్టీల అధ్యక్షులు ఎండీ. అన్వర్, వంగ వెంకట్రామ్‌రెడ్డి, మ్యాక నారాయణ, ఆవు ల మహేందర్, రామోజు కృష్ణమాచారి, టీఆర్‌ఎస్ పట్టణ ఇన్‌చార్జి కాసర్ల అశోక్‌బాబు, నాయకులు గాల్‌రెడ్డి, కుంట మల్లయ్య, గోవిందు రవీ, చొప్పరి శ్రీనివాస్, గూళ్ల రాజు, దండి లక్ష్మి, గాదపాక రవీందర్, దండుగుల రాజ్యలక్ష్మి, ఆలేటి కొండల్‌రెడ్డి, బొద్దుల కనకలక్ష్మి, బండి పుష్ప, యాటకార్ల స్వరూప, బత్తుల చంద్రమౌళి, అఫ్రొజ్, అరుణ్‌కుమార్, తిరుపతినాయక్, సతీశ్‌తోపాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

200
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...