టీఆర్‌ఎస్ సంబురాలు


Sat,September 8, 2018 12:13 AM

శివ్వంపేట: టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ నర్సాపూర్ అసెంబ్లీ టిక్కెట్‌ను ప్రస్తుత మాజీఎమ్మెల్యే మదన్‌రెడ్డికి కేటాయించడంతో మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. శుక్రవారం మండల పరిధిలోని నవాబుపేట గ్రామంలో పార్టీ యూత్ విభాగం అధ్యక్షు డు ఇంద్రేశ్ ఆధ్వర్యం లో కేక్‌కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పర్కిబండలో పూలఅర్జున్, శివ్వంపేటలో వి.శంకరయ్య, లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సురేందర్‌రెడ్డి,గోవర్ధన్‌రెడ్డి, నర్సింగరావు, నవీన్, శ్రీధర్, వినోద్‌గౌడ్, దేవేందర్, సందీప్‌రెడ్డి , గ్రామస్తులు ఉన్నారు.

చిలిపిచెడ్: అసెంబ్లీ రద్దు చేసిన అనంతరం నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.నర్సాపూర్ నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా చిలుముల మదన్‌రెడ్డిని కేసీఆర్ గురువారం ప్రకటించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం హైదారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాసంలో మండల పరిధిలోని చండూర్ గ్రామానికి చెందిన చౌటకూరి జయరాంరెడ్డి ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ రెండోసారి టికెట్ ఇవ్వడంతో గెలుపు కోసం తమవంతుగా కృషిచేస్తామని చెప్పారు.

కొల్చారం: నర్సాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మదన్‌రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో కొల్చారం మండల నేతలు శుక్రవారం అభినందించారు. ఆత్మకమిటీ చైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలువురు డైరెక్టర్లు హైదరాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నివాసానికి చేరుకుని పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తుక్కాపూర్ ఆంజనేయిలు, ఆత్మకమిటీ డైరెక్టర్లు కొల్చారం సంగమేశ్వర్, రాంపూర్ గోవర్ధన్‌రెడ్డిలు ఉన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...