ఎన్నికలకు సై..సిట్టింగులకు జై..


Fri,September 7, 2018 12:37 AM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర శాసన సభ రద్దు కావడంతో త్వరలోనే జరగనున్న ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతుంది. ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10శాసన సభ స్థానాలు ఉండగా 9స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందోల్ మినహా మిగతా అన్ని చో ట్ల సిట్టింగ్ శాసన సభ్యులే పోటీ చేయనున్నారు. జహీరాబాద్ స్థానానికి అభ్యర్థిని త్వరలోనే ప్రకటించనున్నారు. సీఎం కేసీఆర్ పలు సర్వేలు నిర్వహించిన అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. జనంలో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం తో పాటు అభివృద్ధిలో మమేకమవుతున్న సిట్టింగ్ శాసన సభ్యులందరికీ అవకాశం కల్పించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి రెండోసారి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బరిలోకి దిగుతుండగా, సిద్దిపేట శాసన సభ స్థానం నుంచి రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోసారి పోటీ చేస్తున్నారు.

మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, పటాన్‌చెరువులో గూడెం మహిపాల్‌రెడ్డి, దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి, నర్సాపూర్‌లో చిలుముల మదన్‌రెడ్డి, నారాయణఖేడ్‌లో మహారెడ్డి భూపాల్‌రెడ్డిలు సిట్టింగ్‌లు కాగా అందోల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ స్థానంలో చంటి క్రాంతికుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కాగా బాబూమోహన్‌ను మరో పదవిలో సర్దుబాటు చేయనున్నారు. జహీరాబాద్ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ పార్టీ వర్గా ల ద్వారా అందిన సమాచారం. 2014ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ 10 శాస న సభ స్థానాలకు గాను 8స్థానాలను గెలుచుకుంది. గజ్వేల్ నుంచి టీడీపీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 19,578ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట శాసన సభ స్థానం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై తా డూరి శ్రీనివాస్‌గౌడ్‌పై 93,325ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల మెజార్టీతో సోలిపేట రామలింగారెడ్డి, మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతిపై పద్మాదేవేందర్‌రెడ్డి 39, 600ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహపై 3, 280ఓట్ల మెజార్టీతో బాబూమోహన్, సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై 29,336ఓట్ల మెజార్టీతో చింతా ప్రభాకర్, నర్సాపూర్‌లో కాంగ్రె స్ అభ్యర్థి సునీతా లకా్ష్మరెడ్డిపై 14,217ఓట్ల మెజార్టీతో మదన్‌రెడ్డి, పటాన్‌చెరువులో టీడీపీ అభ్యర్థి సపాన్‌దేవ్‌పై 18,738ఓట్ల మోజార్టీతో గూడెం మహిపాల్‌రెడ్డిలు భారీ విజయాన్ని సాధించారు. 2స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. జహీరాబాద్‌లో గీతారెడ్డి, నారాయణఖేడ్‌లో కిష్టారెడ్డిలు సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. ఏడా ది తరువాత కిష్టారెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 9స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీవే. కాగా జిల్లాల పునర్విభజనతో పూర్వ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, మానకొండూరు, పూర్వ వరంగల్ జిల్లాలోని జనగామ, సిద్దిపేట జిల్లాలోకి వచ్చాయి. ఈ నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలైన వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు టికెట్లు ఖరారయ్యాయి.

అభ్యర్థుల ప్రకటనతో సంబురాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 9శాసన సభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో వారి అనుచరులు పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చు తూ స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల 3నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ఆయా నియోజకవర్గా ల ఎమ్మెల్యేలు కృషి చేశారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను తీసుకువచ్చి నియోజకవర్గాల రూపు రేఖలను మార్చారు. రహదారుల నిర్మాణం, మిష న్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ గోదావరి నీళ్లు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు తదితర పనులు చేపట్టి ప్రజల అవసరాలు ఏంటో గుర్తించి అందుకనుగుణంగా పనిచేయడం వల్ల ఇవ్వాల సిట్టింగ్‌లందరికీ అవకాశం వచ్చింది.

210
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...