ఇచ్ఛామరణం.. సాధ్యమే


Fri,September 7, 2018 12:37 AM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ : జన్యుమార్పులతో వయస్సు, మరణాలను అధిగమించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)డైరెక్టర్ డాక్ట ర్ రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గురువారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో గీతమ్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంప స్‌లోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ స్థాయి సింపోజియంను ఆయన ప్రారంభించారు. మెటిరియల్స్ ఇన్ హెల్త్‌కేర్ పేరున నిర్వహిస్తున్న ఈ సదస్సులో డాక్టర్ రాకేశ్ మిశ్రా ఆసక్తికరమైన వాఖ్య లు చేశారు. ఇచ్ఛా మరణం (భీష్మపితామహుని వలే కోరుకున్నప్పుడు చనిపోవడం) జన్యుమార్పులతో సాధ్యమేనన్నారు. మానవ పరిణామ క్రమం, జన్యుమార్పిడి వంటి అంశాలను డిజిటల్ తెరపై చూపించారు. జీవితం అనేది కనిపించే శరీ రం, పరిమాణం, ఆకృతి, బాహ్య రక్షణ, అర్ధవం తమైన జీవితం, భావనలకు అతీతంగా జీవితాన్ని మలచుకోవడానికి శాస్త్రీయత అవకాశం కల్పిస్తున్నదన్నారు. సొసైటీ ఫర్ మినరల్స్ కెమిస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ వీకే జైన్ మాట్లాడుతూ అద్భుతమైన ఉపన్యాసంతో సభికులందరిని ఆకట్టుకోవడమే కాకుండా మూడు రోజుల సింపోజియం ప్రారంభంలోనే గొప్ప ప్రేరణను డాక్టర్ రాకేష్ మిశ్రా ఇచ్చారని కొనియాడారు. గీతమ్ సైన్స్ విద్యార్థు లు ఎవరైన ముంబై వచ్చినప్పుడు తమ సీబీఎస్-డీఏఈ కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. ముం బైలోని బాబా అణు పరిశోధనా సంస్థ పూర్వ శాస్త్రవేత్త డాక్టర్ వి వేణుగోపాల్ మాట్లాడుతూ మనం పర్యావరణాన్ని అలక్ష్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. గీతమ్ ఉపకులపతి ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాధరావు తన అధ్యక్షోపన్యాసంలో పరిశోధనలకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. 1,300 పరిశోధనా ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్టు చెప్పారు. కార్యక్రమంలో గీతమ్ ఉపకులపతి, జీఏ రామారావు పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...