కిలకిల.. కళకళ...


Sun,December 15, 2019 04:02 AM

-కాగజ్‌నగర్‌ అటవీశాఖ డివిజన్‌లో బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌ ప్రారంభం
-మొదటి రోజు అనూహ్య స్పందన..
- తరలివచ్చిన పక్షి ప్రేమికులు, ప్రొఫెషనల్‌ ఫొటో గ్రాఫర్స్‌, విద్యార్థులు
-బైనాక్యులర్‌ ద్వారా వీక్షిస్తూ.. కెమెరాల్లో చిత్రీకరణ
-పిట్టలపై అధ్యయనం.. అరుదైన జాతుల గుర్తింపు
-అగర్‌గూడ అటవీప్రాంతంలో పీసీసీఎఫ్‌ శోభ పర్యటన
పెంచికల్‌పేట్‌/కాగజ్‌నగర్‌టౌన్‌/దహెగాం/తిర్యాణి/కౌటాల/సిర్పూర్‌(టి)/ కాగజ్‌నగర్‌ రూరల్‌/బెజ్జూర్‌ : తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో మొదటిసారిగా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో శనివారం నిర్వహించిన బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన వచ్చింది. హై దరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి 150 మందికి పైగా పక్షి ప్రేమికులు, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌, ఫొటో గ్రాడ్యుయేట్స్‌ తరలిరాగా.. అటవీప్రాంతం కళకళలాడింది. పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూర్‌ గ్రామ సమీపంలోని బొక్కివాగు ప్రాజెక్టు వద్ద ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శోభ, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమా రు 280 రకాల పక్షి జాతులు ఉన్నాయ నీ, ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షిజాతుల్లో ఒక్కటైన రాబందులు ఇక్కడ ఉండ డం గర్వకారణమన్నారు. రష్యా నుంచి అమోర్‌ పాల్కన్‌పక్షి వచ్చిందని తెలిపారు. టూరిజంకు అనువైన ప్రాంతమనీ, జటాయు ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. అనంతరం అగర్‌గూడ దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను పరిశీలించారు.

పెంచికల్‌పేట్‌ అటవీ ప్రాంతంలోని పాలరాపు గుట్ట, రాబందుల గుట్ట సమీపంలో విద్యార్థులు, పక్షి ప్రేమికులు కలియ తిరుగుతూ పక్షుల ఫొటోలను కెమెరాల్లో బంధించారు. బైనాక్యులర్‌ ద్వారా వీక్షించారు. ఎల్లూర్‌ చెరువు వద్ద ఫొ టో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. జిల్లా ఫారెస్టు అధికారి లక్ష్మణ్‌రంజిత్‌నాయక్‌, ఎఫ్‌డీవోలు విజయ్‌కుమార్‌, లావణ్య, అటవీశాఖ అధికారులు శివకుమార్‌, పూర్ణిమ, శ్రీనివాస్‌రెడ్డి, ఎక్బాల్‌, ప్రభాకర్‌, అన్నపూర్ణ, సంతోశ్‌, రాజేశ్‌, రవికాంత్‌ వారి వెంట ఉన్నారు. దహెగాం మండలం లోహ అటవీ ప్రాంతం లో కంగ్‌ఫిషర్‌, అడవి కోడి, నెమ లి, పిచ్చుకలు రామ చిలుకలు, గువ్వలు తదితర పక్షి జాతుల గురించి ఎఫ్‌ఎస్‌వో సతీష్‌కుమార్‌, ఎఫ్‌బీవో రమేశ్‌, గంగాధర్‌ వివరించారు. సిర్పూర్‌ రేంజ్‌ పరిధిలో గోల్యాల మా లిని, చీలపెల్లి బీట్‌లలో ఎఫ్‌ఆర్వో పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో 12 మంది పక్షి ప్రేమికులు సందర్శించారు. డిప్యూటీ ఎఫ్‌ఆర్వోలు ప్రతా ప్‌ నాయక్‌, ప్రకాశ్‌, సెక్షన్‌ ఆఫీసర్లు సంతోష్‌, సద్దాం వారి వెంట కలియదిరిగారు.

కాగజ్‌నగర్‌ మండలం కోసిని రిజర్వాయర్‌ సమీపంలో వివిధ రకాల పక్షులు సందడి చేయ గా, పలువురు బైనాక్యులర్‌ ద్వారా వీక్షించారు. బెజ్జూర్‌ చెరువులు, అటవీ ప్రాంతాల్లో హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ ఎన్‌జీవో అధ్యక్షుడు హరిక్రిష్ణ, దక్కన్‌ బర్డర్స్‌ సభ్యుడు శ్రావణ్‌ కుమార్‌ సందర్శించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. రేంజ్‌ అధికారి కిరణ్‌ కుమార్‌, వన్యప్రాణుల పరిశోధకుడు రవికాంత్‌, హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ (ఎన్‌జీవో) వైస్‌ ప్రెసిడెంట్‌ క్రిష్ణ, కోశాధికారి కళ్యాణ్‌, సభ్యులు శ్రీరామ్‌, గోపాల్‌ ఉన్నా రు. ఇక తిర్యాణి మండలం రోంపల్లి, గుండా ల అడవుల్లో ఎఫ్‌ఆర్వో వినయ్‌కుమార్‌సా హు ఆధ్వర్యంలో బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. డ్రోన్‌ కెమెరాలతో పక్షులను గుర్తించారు. డిప్యూటీ రేంజర్లు సంతోశ్‌కుమార్‌, రాంబాబు, ఎఫ్‌బీవో మల్లిఖార్జున్‌, ఎనిమల్‌ ట్రాకర్స్‌ రవి, సమ్మయ్య పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...