సకల సౌకర్యాల హాస్టళ్లు


Sat,December 14, 2019 12:01 AM

-జిల్లాలో రెండు ట్రైబల్‌ పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలు
-కార్పొరేట్‌కు దీటుగా మెనూ
-వారంలో రెండు రోజులు నాన్‌వెజ్‌
-474మంది విద్యార్థులకు ప్రయోజనం
-తెలంగాణ సర్కారు ప్రత్యేక శ్రద్ధ
నాడు కట్టెలపొయ్యి మీద..
గత ప్రభుత్వాల హయాంలో ఈ హాస్టళ్లలో అరకొర సౌకర్యాలు ఉండేవి. భోజనం కూడా మెనూ ప్రకారం ఉండేది కాదు. నాడు కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు. టిఫిన్లు, భోజనం, స్నాక్స్‌ కోసం ఇదివరకు వెయ్యి రూపాయలే ఇచ్చేవారు. డైనింగ్‌ టేబుళ్లు, బల్లలు, రక్షిత మంచినీరు లేకపోయేవి. కరెంట్‌ పోతే క్యాండిల్‌ వెలిగించాల్సిన దుస్థితి ఉండేది. వారంలో రెండు కోడిగుడ్లు, ఒకేసారి చికెన్‌ పెట్టేవారు.

స్వరాష్ట్రంలో మారిన పరిస్థితి
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న మెస్‌చార్జీలను వెయ్యి నుంచి రూ.1500లకు పెంచింది. ఫలింగా విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు వీలు కలిగింది. అంతేగాక రోజుకో తీరు మెనూ అందిస్తూ రుచికరమైన పౌష్ఠికాహాం అందుతోంది. ఇందుకోసం తక్కువ సమయంలో మంచి పదార్థాలు చేసేందుకు గ్రైండర్లు, స్టీమ్‌ కుకింగ్‌, గ్యాస్‌ స్టవ్‌లు, ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌, డైనింగ్‌ టేబుళ్లు, బల్లలు అందుబాటులోకి తీసుకొచ్చి కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పి స్తోంది. అలాగే కరెంట్‌ పోయినా విద్యార్థులు చదువుకునేందుకు అనువుగా సోలార్‌ ఇన్వర్టర్‌, బ్యాటరీలు అందజేసింది. అంతేగాక సెలవు రోజుల్లో వినోదం కోసం టీవీ కూడా ఏర్పాటుచేసింది. విద్యార్థుల, వార్డెన్‌ల అవసరాల కోసం కంప్యూటర్‌, స్కానర్‌, ప్రింటర్‌తో పాటు చదువుకునేందుకు పుస్తకాలను సమకూర్చింది. విద్యార్థులు పడుకు నేందుకు వీలుగా డబుల్‌బెడ్స్‌(బంకర్‌) ఏర్పాటుచేశారు.

మెరుగైన ఫలితాలు..
ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకున్న విద్యార్థులు పరీక్షల్లో తమ సత్తాచాటుతున్నారు. గతేడాది 2018-2019 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల్లో బాలుర విభాగంలో 100శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారు. అలాగే డిగ్రీ పరీక్షల్లో 90శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక బాలికల విభాగంలో ఇంటర్‌ పరీక్షల్లో 95శాతం ఉత్తీర్ణత సాధించగా, డిగ్రీలో 90శాతంతో ఫలితాలు నమోదయ్యాయి.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...