మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత


Fri,December 13, 2019 11:59 PM

దండేపల్లి : హరితహారంలో, 30 రోజుల ప్రణాళికలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్ర తి ఒక్కరిపై ఉందని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం మం డల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గ్రీన్‌ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ మొక్కలకు నీరందించారు. దండేపల్లి, తాళ్లపేట, కొత్తమామిడిపెల్లి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రీన్‌ఫ్రైడే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ శ్రీనివాస్‌, సర్పంచ్‌లు కళావతి, చంద్రకళ, గడ్డం రాజయ్య, ఎంపీటీసీ ము త్తె రాజన్న, ఉపసర్పంచ్‌లు పుట్టపాక తిరుపతి, నలిమెల మహేశ్‌, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, నాయకులు ఎల్‌ రాజశేఖర్‌, గడిపెల్లి సత్యం, గోపిచంద్‌, తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల రూరల్‌ : హాజీపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో గ్రీన్‌ ప్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు నీరు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామంలో నాటిన మొక్కలను రక్షించేందుకు ట్రీ గార్డుల ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
జన్నారం : గ్రీన్‌ ఫ్రైడే సందర్భంగా మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో 30రోజుల గ్రామ ప్రణాళికలో నాటిన హరిత హారం మొక్కలకు గ్రామ సర్పంచ్‌ జాడి గంగాధర్‌ నీరు పోశారు. గ్రామంలోని నాటిన మొక్కలన్నింటినీ సంరక్షిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లావణ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...