సాయినాథుని సేవలో..


Thu,December 12, 2019 01:45 AM

]మంచిర్యాల అగ్రికల్చర్‌: దత్త జయంతిని ప ట్టణంలోని సాయిబాబా ఆలయంలో బుధవా రం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో తూ ముల భీమయ్య ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి సాయిని దర్శించుకున్నారు. ఎమ్మె ల్యే వెంట టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు, ట్రస్ట్‌ చైర్మన్‌ తూముల నరేశ్‌, ఎస్‌ఐ ప్రవీణ్‌ కు మార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పెంట రాజయ్య, తోట తిరుపతి, బొలిశెట్టి కిషన్‌ పాల్గొన్నారు. హమాలీవాడ హనుమాన్‌ సాయి ఆలయంలో నల్ల కోటమ్మ-లక్ష్మయ్య ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పూ జలు చేశారు. ఉదయం 108 కలశాలతో బాబా కు అభిషేకం, మధ్యాహ్న హారతిచ్చి అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్‌, ము న్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నల్ల శంకర్‌, బుడి అరుణ్‌ శర్మ, సంగనభట్ల కిరణ్‌ కుమార్‌ శర్మతో పాటు అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బస్టాండ్‌ ఏరియా జాఫర్‌నగర్‌లోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే దివాకర్‌ రావు దంపతు లు, భక్తులు పూలతో ర్యాలీగా బాబాకు పూలాభిషేకం చేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...