ఫిర్యాదుదారులకు అండగా జీరో ఎఫ్‌ఐఆర్‌


Thu,December 12, 2019 01:42 AM

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: సరిహద్దు, పరిధి తో సంబంధం లేకుండా ఫిర్యాదుదారులకు సత్వర న్యా యం చేసేందుకు పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ మే రకు జీరో ఎఫ్‌ఐఆర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నేరం ఎక్కడ జరిగినా, సమస్య ఏదైనా అందుబాటులో ఉన్న పో లీస్‌ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది. ఆపదలో ఉన్నామంటూ స్టేషన్‌కు వచ్చే బాధితులను కేసు తమ పరిధిలోది కాదంటే, తమది కాదని చెప్పి తిప్పి పంపేందుకు ఇక వీలు లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు దాన్ని పంపిస్తారు. తమ పరిధిలో లేని కేసు ఎఫ్‌ఐఆర్‌, డైరీని తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత పోలీసులకు పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఫిర్యాదు దారులకు ఈ జీరో ఎఫ్‌ఐఆర్‌ కొండంత అండగా నిలవనుంది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...