బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే


Sun,December 8, 2019 11:44 PM

దండేపల్లి : దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బడి బయట ఉన్న విద్యార్థులపై సర్వే చేపట్టినట్లు ఎంఈఓ రవీందర్‌ తెలిపారు. 14 ఏళ్లలోపు బడి బయట ఉన్న విద్యార్థుల వివరాల కోసం సీర్పీలు సర్వే చేస్తున్నారు. రోజుకో గ్రామం చొప్పున క్షేత్రస్థాయి సర్వే చేసి బడికి దూరంగా ఉన్న విద్యార్థుల వివరాలు, కారణాలు నమోదు చేయనున్నారు. దీనిలో భాగంగా మండలంలోని ఇప్పలగూడెంలో సీఆర్‌పీ పెట్టెం శ్రావణ్‌ కుమార్‌ బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలు సేకరించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles