కొత్త పంట


Sat,December 7, 2019 11:18 PM

-నెన్నెల మండలం తప్ప మిగతా ప్రాంతాల్లో సాగుకు అనుకూలం
-చెన్నూర్‌ సెగ్మెంట్‌లోనే 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు
-అధికారులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
-నివేదికలు రూపొందిస్తున్న హార్టికల్చర్‌ అధికారులు
-ఆసక్తి చూపుతున్న వేలాది మంది రైతులు
-ఇప్పటికే 2,500 మంది రైతుల అంగీకారం

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆయిల్‌ పాం సాగు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండ డం, కాళేశ్వరం నీటి లభ్యత పుష్కలంగా ఉండడం, ఉత్పత్తికి ఉష్ణోగ్రత అనువుగా ఉండటంతో హార్టికల్చర్‌ అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా.. ఒక నెన్నెల మండలం మినహా అన్ని మండలాల్లో సాగు చేసేందుకు అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సాగుకు అనుగుణంగా దిగుబడి ఇచ్చే నేలలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఎకరం వరి సాగు అయ్యే నీటితో మూడెకరాల పామాయిల్‌ పంట సాగవుతుందని, అంతర్‌ పంటల సాగుతో అధిక లాభాలు కూడా వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఆయిల్‌ పాం సాగుపై అధికారులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అధ్యయనంలో చెన్నూర్‌ నియోజకవర్గం
ఆయిల్‌ పాం సాగును రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం అధికారులు, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ పర్యటించింది. ఈ కమిటీ జిల్లాలో ఏ విధమైన వాతావరణం ఉంది? ఈ వాతావరణం పంటలకు అనుకూలమా? లేదా? ఇక ఎలాంటి నే లలు ఎక్కువగా ఉన్నాయి? నీటి లభ్యత ఎంత? ఇ లాంటి అంశాలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిం ది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటుతో పెద్ద ఎత్తున నీటి వ నరులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క చెన్నూరు నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున సాగు చేసేందుకు ముందుకు సాగుతున్నా రు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్‌ బాల్క సుమన్‌ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 5వ తేదీన అధికారులతో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆయిల్‌ పాం సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహకాలు అందిస్తున్నది. మొక్క నుంచి మార్కెటింగ్‌ వరకు రైతులకు సాయం అందనుంది. రైతులకు మొక్క రూ.25లకే అందిస్తారు. మొక్కలను కూడా ఉపాధి హామీ పథకం కింద నాటించనున్నారు. మరోవైపు ఈ మొక్కలను పెంచడానికి స్థానికంగానే అధికారులు నర్సరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. సబ్సిడీపై వారికి డ్రీప్‌ పరికరాలు అందించనున్నారు. మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు జైపూర్‌ వద్ద ఆయిల్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి జీవో 41 కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దాని సాగు విషయానికి వస్తే సాగు ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, నామ మాత్రపు ఎరువులు వాడితే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.

అయిల్‌ పాం సాగు ఇలా..
ప్రపంచంలోనే ఆయిల్‌ పాం సాగులో భారతదేశం నాలుగో స్థానం ఉండగా.. దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ పంటలకు చీడపీడలు, కోతుల బెడద, వడగండ్ల వాన, దొంగల బెడద ఉం డదు. పాం ఆయిల్‌ కంపెనీలే నేరుగా వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి కొనుగోలు చేస్తాయి. తెలంగాణ వాతావరణ పరిస్థితుల్లో హెక్టారుకు 15 టన్నుల నుంచి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కొబ్బరి చెట్టులా ఉండే ఆయిల్‌ పాం నిటారుగా పెరిగి బలమైన కాండం కలిగి ఉంటుంది. కొమ్మలు లేకుండా దేశీరకం చెట్టు 15 మీటర్ల ఎత్తు సంకర జాతి చెట్టు 4 నుంచి 5 మీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. పండుపై భాగం నూనె కలిగిన గుజ్జు, లోపలి భాగంలో గట్టి పెంకుతో మెత్తటి గింజ ఉంటుంది. మూడు రకాలుగా ఈ తోటల పెంపకం చేపట్టవచ్చు. రెండు నుంచి పది హెక్టార్లు(5-25 ఎకరాలు) ఉన్న పామాయిల్‌ తోటలు, 10-300 హెక్టార్లలో (25-750 ఎకరాలు), భారీ వ్యవసా యం అంటే 500 హెక్టార్లు అంతకు మించి (1200 ఎకరాలు)లలో సాగు చేయవచ్చు.

ప్రత్యామ్నాయ పంట వల్ల మేలు
జిల్లాలో వరి కంటే పెద్ద ఎత్తున పత్తి పంట సాగు చేస్తున్నారు. 1.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారని అంచనా. అయితే, ఇప్పటి వరకు నీటి వసతి సరిగ్గా లేని కారణంగా ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. పత్తి పంట వర్షాలు సక్రమంగా కురిస్తే పండినట్లు, లేకపోతే ఎండినట్లు అనే విధంగా పరిస్థితి తయారయ్యింది. అయినా వేరే పంటలు పండించలేక, ఏం చేయాలో దిక్కుతోచక రైతులు పత్తి వైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలోనే పత్తి అత్యధికంగా పండించే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ అందులోనూ మంచిర్యాల ప్రాంతం మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. అయితే ఇప్పటి వ రకు సరైన ప్రత్యామ్నాయం లేక ఆ పంట మాత్రమే పండించుకుంటున్నారు. ప్రభుత్వ విప్‌ బాల్క సు మన్‌ ప్రత్యేకంగా ఈ ఆయిల్‌ పాం సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆయిల్‌ పాం పంటలో అంతర్‌ పం టలు కూడా పండించుకునే అవకాశం ఉండడంతో రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనుంది.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles