ఓటర్ల అభ్యంతరాలపై విచారణ


Sat,December 7, 2019 11:15 PM

సీసీసీ నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీలో ఓటర్ల అభ్యంతరాలపై అధికారులు విచారణ చేపట్టారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3న అధికారులు ముసాయిదా(డ్రాఫ్ట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూర్‌ ప్రజల ఓట్లు శ్రీరాంపూర్‌ వార్డుల్లో కలపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఓట్లను తాళ్లపెల్లిలో కలపాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ టీపీబీఓ యశ్వంత్‌కుమార్‌ సిబ్బందితో కలిసి సింగాపూర్‌, తాళ్లపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఓటు విషయంలో ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల కోరిక మేరకు ఓటర్లను తాళ్లపల్లి గ్రామంలో కలుపుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ సిబ్బంది నారాయణ, సతీశ్‌, సంపత్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

‘వార్డుల విభజనలో మార్పు చేయాలి’
మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: మంచిర్యాల మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటుచేసిన వార్డుల విభజనలో మార్పులు చేయాలని కోరుతూ పలువురు వినతి పత్రాలు అందజేస్తున్నారు. శనివారం ఐదోవార్డుకు చెందిన పలువురు మహిళలు తమ ఇంటి నెంబర్లను పాత 20వ వార్డు పరిధిలో కలిపారని, సాయినగర్‌ ఏరియా ఒకచోట ఉంటే తమ ఓట్టు ఇక్బాల్‌ అహ్మద్‌నగర్‌ ఏరియాలో కలిపారని, దీంతో తమవార్డు దూరంగా ఉంటుందనీ, ఈ విషయంలో తగిన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రజియా, సునీత, అబ్దుల్‌ జలీల్‌ వినతిపత్రం అందించారు. హమాలివాడకు చెందిన సాహెచ్‌ సాయిరాం, సాయి క్రిష్ణ, మహేశ్‌ తదితరులు తాము కొత్తగా ఏర్పాటు అయిన 14వ వార్డులో నివాసం ఉంటామని, అయితే తమ పేర్లు మాత్రం 15వ వార్డు వచ్చాయని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...