స్వచ్ఛ సింగరేణిగా తీర్చిదిద్దుతున్నాం


Sat,December 7, 2019 12:36 AM

శ్రీరాంపూర్ : స్వచ్ఛ పఖ్వాడ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాలతో స్వచ్ఛ సింగరేణిగా తీర్చిదిద్దుతున్నామని జేసీ సురెందర్‌రావు, శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ కార్తికేయన్, డిప్యూ టీ కమాండెంట్ రాకేశ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన మెగా సైకిల్ ర్యాలీని జేసీ సురెందర్‌రావు, జీఎం లక్షీనారాయణ ప్రారంభించారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, విద్యార్ధులు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజీత్‌రావు, జీఎం, సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ప్రగతి స్టేడియంలో జరిగిన పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సురెందర్‌రావు, కమాండెంట్ కార్తీకేయన్, జీఎం లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రతిఒక్కరు గుడ్డ సంచులు వినియోగించాలని కోరారు. అన్ని శాఖల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతాపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం గోవిందరాజు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురెందర్‌రెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవిందర్‌రెడ్డి, వీరభద్రయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు కుమారస్వామి, రమేశ్, కాశీరావు, అన్నయ్య, అశోక్, సేవా సమితి అధ్యక్షురాలు సరళాదేవి, పీఎం తుకారాం, సీఐఎస్‌ఎఫ్ లైజన్ ఆఫీసర్ సంతోష్‌కుమరా, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి పత్తి గట్టయ్య, మాజీ సర్పంచులు రాజేంద్రపాణి, జక్కుల రాజేశం పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles