ఓసీపీలో షావెల్ ప్రారంభం


Sat,December 7, 2019 12:36 AM

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీలో యాజమాన్యం నూతనంగా కొనుగోలు చేసిన షావెల్ యంత్రాన్ని శుక్రవారం జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ ప్రా రంభించారు. షావెల్‌ను రక్షణ చర్యలు పాటిస్తూ నడపాలని ఆదేశిస్తు తాళాలు కార్మికుడికి అందించారు. ఈ సందర్భం గా జీఎం మాట్లాడుతు షావెల్‌తో ఉత్ప త్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. షావెల్ ను రూ. 3.69 కోట్లతో కొనుగోలు చేశామని తెలిపారు. యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురెందర్‌రెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్ చింతల శ్రీనివాస్, సేఫ్టీ ఆపీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీవైజీఎం రాజశేఖర్, మేనేజర్ జనార్దన్, ఫిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, అధికారులు శ్యాంసుందర్, శ్రీధ ర్, సీనియర్ పీలో పాషా, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...