‘షీటీం’ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది


Fri,December 6, 2019 12:10 AM

మంచిర్యాలటౌన్‌, నమస్తే తెలంగాణ: మహిళల రక్షణ కోసం షీటీం పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని మంచిర్యాల మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మంచిర్యాలలోని వాగ్థేవి డిగ్రీ కళాశాలలో గురువారం విద్యారిన్థులకు షీటీం పోలీసుల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా స్పందించాలి, ఎవరు సాయం చేస్తారు, ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎలాంటి ఫిర్యాదులు చేయవచ్చు, షీటీంలతో కలిగే లాభాలు, మహిళలకు, యువతులకు ఉపయోగపడుతున్న తీరును వివరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, కళాశాల కరస్పాండెంట్‌ పీ మల్లేశ్‌, డైరెక్టర్లు శ్రీకర్‌, మురళి, రాజు, మహేందర్‌, విద్యార్థినులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...