శివారుపై నిఘా


Thu,December 5, 2019 02:39 AM

-నేరాలకు ఆస్కారం ఉండే 147 ప్రాంతాలు గుర్తింపు
-లారీ అడ్డాలు, బహిరంగ మద్యపాన ప్రదేశాలపై నజర్‌

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మహిళలు జ నసంచారం లేని ప్రదేశాలు, శివారు ప్రాంతాలు, లా రీల అడ్డాలు, బస్టాప్‌లు, అర్ధరాత్రి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో ఆగడానికి జంకుతున్నారు. అయినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వెళ్లక తప్పదు. అటువంటి సందర్భాల్లో అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు ఒంటరిగా క నిపిస్తే చాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నిత్యం నేరాలు జరిగే ప్రాంతాలు, శివారు ప్రాంతా లు, ఈవ్‌ టీజింగ్‌, బహిరంగ మద్యపానం సేవించే ప్రాంతాలు, లారీ అడ్డాలు ఇలాంటి ప్రాంతాలపై పో లీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడ ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్ర త్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

నేరాలకు అడ్డాలుగా..
పల్లె, పట్టణ శివారు ప్రాంతాలు నేరాలకు అడ్డాలు గా మారుతున్నాయి. రాత్రయిందంటే ఒంటరిగా వెళ్లడానికి జంకుతున్నారు. కొన్ని సందర్భాల్లో పట్టపగలు కూడా అటు వైపు వెళ్లలేని పరిస్థితి. ఇటీవల దారుణాలు అన్నీ శివారు ప్రాంతాల్లోనే జరుగుతుండటంతో అటువైపు దృష్టి పెట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళలు, యువతులు ధైర్యంగా నిలబడే విధంగా వాతావరణం కల్పించనున్నారు. ముఖ్యంగా వ్యా పార కేంద్రాలు, లారీ అడ్డాలపై ప్రత్యేక నిఘా పెట్టా రు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ప్రాం తాలను గుర్తించారు. కేవలం పట్టణాలే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో ప్రేమ జం టలను బెదిరించి దోపిడీలకు పాల్పడటం, కొన్ని చోట్ల యువకులు గుంపులుగా ఏర్పడి పార్టీలు చేసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో బ్యాచ్‌లుగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో పా ర్టీలు చేసుకుంటున్నారు. మరికొన్ని అడ్డాలు పేకాట స్థావరాలుగా మారుతున్నాయి. జనసంచారం ఎక్కువగా ఉండకపోవడంతో యువకులు బైక్‌ల మీద, ఆటోల్లో వచ్చి మద్యం తాగుతున్నారు.

నిఘా ఇలా..
ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రజలు ముఖ్యంగా మహిళలు, యువతలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు పూర్తి స్థాయి లో సమాయత్తం అయ్యారు. ఇప్పటికే ‘ఆపరేషన్‌ చబుత్రా’, షీ టీమ్స్‌ పేరిట పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

యువతులు, మహిళలను వేధించే వారిని షీటీమ్స్‌ అదుపులోకి తీసుకుని కేసులు పెడుతున్నారు. అదే సమయంలో ఆపరేషన్‌ చబుత్రా కూడా అర్ధరాత్రి రోడ్లపై తిరిగే వారిపై నిఘా పెట్టి పోకిరీలు, యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపుతున్నారు. కొత్తగా శివారు ప్రాంతాలపై దృష్టిపెట్టిన ఖాకీలు ప్రణాళికలు రూ పొందించారు. పెట్రోకార్‌, బ్లూకోర్టుల పేరుతో ఇప్పటికే పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా శివారు ప్రాంతాలపై సీఐ స్థాయి అధికారి ఒకరు గస్తీ నిర్వహిస్తారు. ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అందిస్తారు. దీంతో ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్య లు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...