నేటి నుంచి ఇంటింటా టీఆర్‌ఎస్‌


Thu,December 5, 2019 02:35 AM

-ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు
-పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులకు సూచనలు
-అన్ని మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగరేయాలని పిలుపు

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి ఇం టింటా టీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దివాకర్‌రావు తెలిపారు. తన నివాసం లో మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను చేపట్టిందనీ, వార్డుల పునర్విభజన, ఓటర్ల లిస్టు తయారీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఆ వెంటనే రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తంగా ఉండాలన్నారు. ఈ సారి మంచిర్యాలతో పాటు లక్షెట్టిపేట, నస్పూర్‌ మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఉంటాయనీ, నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని దీనికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనీ, అందుకు వార్డుల వారీగా ప్రతి కార్యకర్త పూర్తి స్థాయి శిక్షణ పొంది ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ నిర్ధేశించిన వారికి టికెట్లు వస్తాయనీ, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవస రం ఉందన్నారు. పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వసుంధర, ఐసీ డీఎస్‌ ఆర్గనైజర్‌ అత్తి సరోజ, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గాదెసత్యం, కార్యదర్శి పెండ్లి అంజయ్య, నాయకులు పెంటరాజయ్య, తోట తిరుపతి, గాజుల ముకేశ్‌గౌడ్‌, గొంగళ్ల శంకర్‌, సుదమల్ల హ రికృష్ణ, సురేష్‌బల్దవా, రాజారాం, బొలిశెట్టి కిషన్‌, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేటలో ప్రచారం..
లక్షెట్టిపేట: వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజ లు టీఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కట్టాలని ఎమ్మెల్యే ది వాకర్‌ రావు ప్రజలను కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పే మాయ మా టలు నమ్మవద్దన్నారు. మున్సిపాలిటీని అన్ని విధా లుగా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...