సహజ ప్రసవాలతోనే ఆరోగ్యం


Thu,December 5, 2019 02:34 AM

లక్షెట్టిపేట: సహజ ప్రసవంతో తల్లీ, శిశువు ఆరోగ్యం బాగుం టుందని కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శిక్షణ ప్రోగ్రాం టీం లీడర్‌ డాక్టర్‌ సల్వా సుజాత పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభు త్వ దవాఖానలో ‘సహజ ప్రసవాలు-ప్రభుత్వ లక్ష్యాలు’పై ఆమె బుధవారం తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వాప్తంగా సుశిక్షితులైన 30 మంది ప్ర సూతి వైద్య సహాయకులను సహజ ప్రసవాల కోసం నియమించిందన్నారు. శస్త్ర చికిత్స వలన కలుగుతున్న అనర్థాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకాలతో పేదలకు ఉత్తమ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.

ప్రభుత్వం కనీసం 85 శాతం సహజ ప్రసవాలు ప్రతి దవాఖానలో జరిగేలా చర్యలు చేపట్టిందన్నారు. శస్త్ర చికిత్సతో కలుగుతున్న అనారోగ్య ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే శస్త్ర చికిత్సలకు రెఫర్‌ చేయాలని ప్రసూతి వైద్య సహాయకులు, డాక్టర్లను ఆదేశించారు.

అనంతరం అనవసర డెలివరీ (అన్‌ వాంటెడ్‌ డెలివరీ) శస్త్ర చికిత్సతో తల్లీ, బిడ్డలకు కలుగుతున్న అనర్థాలు, ఆరోగ్య సమస్యలపై దవాఖానలోని ప్రసూతి వైద్య సహాయకులు, డాక్టర్లకు అవగాహన కల్పించారు. అంతకుముందు దవాఖానలోని రిజిస్టర్లను పరిశీలించారు. సహజ ప్రసవాలు నెలకు కనీసం 100 చొప్పున చేయాల్సి ఉన్నప్పటికీ ప్రసూతి వైద్య సహాయకులు నాలుగు నెలల్లో కేవలం 28 మాత్రమే చేయడంపై మండిపడ్డారు. స్టాఫ్‌ నర్సులు గతంలో చేసిన 20 సహజ ప్రసవాలను కూడా తమ ఖాతాలో వేసి మొత్తం 48 అని చూపించడంతో వైద్య సహాయకులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖాన వైద్యులు కు మార స్వామి, పవన్‌, హెడ్‌ నర్సు శ్రీదేవి, ప్రసూతి వైద్య సహాయకురాలు శ్యామల, శ్రీవేణి, జానా, సుజాత ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...