ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేద్దాం


Thu,December 5, 2019 02:33 AM

-కలెక్టర్‌ భారతి హోళికేరి
-జిల్లా కేంద్రంలో 2కే రన్‌
-ముందుకు రావాలని ప్రజలకు పిలుపు

మంచిర్యాల టౌన్‌, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మిషన్‌ ప్లాస్టిక్‌ ఫ్రీ మంచిర్యాల’లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం 2కే రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి భారతి హోళికేరి ముఖ్య అతిథిగా పాల్గొని జెం డా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఐబీ చౌరస్తా నుంచి మొదలైన పరుగు టీటీడీ కల్యాణ మం డపం, బెల్లంపల్లి చౌరస్తా, బస్టాండ్‌ మీదుగా రైల్వేస్టేషన్‌ వరకు చేరుకుంది. రైల్వే స్టేషన్‌ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌కు వ్యతిరేఖంగా ప్రతిజ్ఞ చేశారు. 2కే రన్‌లో విజేతలుగా నిలిచిన ముగ్గురికి బహుమతులు అం దించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిషేధానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మిషన్‌ ప్లాస్టిక్‌ ఫ్రీ మంచిర్యాలలో ఇప్పటి వరకు 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామనీ, మిగిలిన మొత్తాన్ని కూడా గడువులోగా చేరుకునేందుకు అన్ని వర్గాల ప్రజ లు ముందుకు రావాలని కోరారు. ఇండ్లలోనే ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా మానేయాలనీ, చెత్త సేకరణ సమయంలో కూడా తడి, పొడి చెత్తల ను వేరు చేసి అందించాలని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, ఏఈ నర్సింహాస్వామి, టీపీవో సత్యనారాయణ, ఆర్వో చిప్పకుర్తి రమేశ్‌, ఆర్‌ఐ మజార్‌, సీనియర్‌ అసిస్టెంటు తన్నీరు రమేశ్‌, సానిటరీ ఇన్‌చార్జిలు సు నీల్‌ రాథోడ్‌, అజీం, పోలీస్‌, అటవీశాఖ అధికారులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...