ఆ నిధులు మాకివ్వండి


Tue,December 3, 2019 11:34 PM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జాతీయ రహదారి 63కు సంబంధించిన ఈపీసీ టెండర్‌లో మిగిలిన నిధులను చెన్నూర్‌ నియోజ కవర్గ అభివృద్ధికి కేటాయించాలని ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, అడిషనల్‌ డైరెక్టర్‌ జన రల్‌ వై బాలకృష్ణతో ఆయన సమావేశమయ్యా రు. ప్రాణహిత నదిపైన వంతెన నిర్మాణం పూర్తి కావడంతో చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు సౌకర్యాలు మెరుగుడపడ్డాయని తెలిపారు. ఈ జాతీయ రహ దారి మిగులు నిధుల ద్వారా ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద సుమారు రూ. 6 కోట్లతో వరద కాలువ నిర్మాణం, బస్‌షెల్టర్ల నిర్మాణంతో పాటు, రోడ్డు విస్తరణ పనులు, వై జంక్షన్‌ సుందరీకరణ పనులు చేయాలని కోరారు. జైపూర్‌, హామారం మండల కేంద్రాల్లో రూ. 50లక్షలతో సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మించాలన్నారు. కిష్టంపేట ఎక్స్‌రోడ్డు వద్ద సు మారు రూ. 10.04 కోట్లతో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మా ణం, చెన్నూర్‌ నుంచి ఆస్నాదకు వెళ్లే రోడ్డు మా ర్గంలో రూ. 11 కోట్ల 65 లక్షలతో కత్తెరశాల ఎక్స్‌ రోడ్డు వద్ద జంక్షన్‌ నిర్మాణంతో పాటు ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనికి కేంద్ర మం త్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పం దించినట్లు విప్‌ సుమన్‌ వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ వెంక టేశ్‌ నేత, పలువురు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...