గ్రాస్‌ ప్లాంటేషన్లపై దృష్టి పెట్టండి


Tue,December 3, 2019 11:34 PM

-ఎన్‌టీసీఏ ఎన్‌ఎస్‌ మురళి
జన్నారం : గ్రాస్‌ ప్లాంటేషన్లు, గడ్డి విత్తనాల సేకరణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అధికారి ఎన్‌ఎస్‌ మురళి పేర్కొన్నారు. మంగళవారం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌డ్‌ అడవులోని ఇందన్‌పెల్లి రేంజ్‌లో పెంచు తున్న గడ్డి క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని అటవీ శాఖ కమ్యూనిటీ హాల్‌ ఎదుట అటవీ శాఖ అధికారు లు సేకరించిన విత్తనాలను పరిశీలిం చి మాట్లాడారు. రాబోయే రోజుల్లో అడవుల్లోని అన్ని బీట్లలో గడ్డి క్షేత్రాలను ఎర్పాటు చేస్తామని తెలిపారు. దానికి అనుగుణంగా గడ్డి విత్తనాలను సేకరించి వన్య ప్రాణులకు కావాల్సిన ఆహారం అడవుల్లో లభించే లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బీట్‌ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గడ్డి క్షేత్రాలను విరివిరిగా పెంచేలా చూడాలని పేర్కొన్నారు. ఆయన వెం ట ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌, ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌, ఎఫ్‌డీఓ మాధవరావు, జన్నారం, ఇందన్‌పెల్లి రేంజ్‌ ఆఫీసర్లు వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రావు, డీఆర్‌ఓ గోపాల్‌సింగ్‌, ప్రకాశ్‌ ఉన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...