ఆర్టీసీకి ఆర్థిక చికిత్స


Mon,December 2, 2019 11:13 PM

-జిల్లాలో ప్రతి నెలా రూ.80 లక్షల నష్టాలు
-బస్‌ చార్జీల పెంపుతో కాస్త ఊరట
-కిలో మీటర్‌కు 20 పైసల పెంపు

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఒక్క ఆర్టీసీ డిపో మాత్రమే ఉంది. 86 ఆర్టీసీ, 50 హైర్‌విత్‌ బస్సులు తిరుగున్నాయి. రోజు 57 వేల కిలోమీటర్ల మేరకు ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నాయి. ఈ డిపోకు ప్రతి రోజు రూ.12 లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇదేకాలంలో ప్రతి నెలా దాదాపు రూ.80 లక్షల మేరకు నష్టాలు వస్తున్నాయి. కిలోమీటర్‌కు 20 పైసల పెంపుతో అదనం గా రూ.72 లక్షల ఆదాయం సమకూరనుంది. మం చిర్యాల నుంచి హైదరాబాద్‌, కరీంనగర్‌, చెన్నూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌ ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్‌లు, సూపర్‌ లగ్జరీ సర్వీసులు నడుస్తున్నాయి. ప్రధాన మార్గాల్లో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా.. పల్లె వెలుగు బస్సుల్లో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కాస్తంత ఉపశమనం
జిల్లాలో ఉన్న డిపో పరిధిలో చాలా ఏండ్లుగా సంస్థ నష్టాల్లోనే నడుస్తోంది. ప్రతి నెలా రూ. 80 లక్షల మేర నష్టాలను మూట గట్టుకుట్టుకుంటోంది. నష్టాల నుంచి డిపోను గట్టెక్కించేందుకు అధికారులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్టీసీలో దాదాపు 52 రోజులపాటు చేసిన సమ్మెతో ఆర్టీసీ పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగేండ్లుగా సర్కారు చార్జీలు కూడా పెంచలేదు. ముఖ్యంగా డీజిల్‌ ధరలు ఆర్టీసీ కొంప ముంచుతున్నాయి. రెం డున్నరేళ్లుగా రోజువారీగా అంతర్జాతీయ మార్కెట్‌ లో చమురు ధరల ఆధారంగా డీజిల్‌ ధరలను కేం ద్రం పెంచుతూ వస్తోంది. ఇదీ ఆర్టీసీపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోంది. విభాగాలవారీగా కాకుండా అన్ని బస్సులకు ఏక మొత్తంలో ప్రతి కిలోమీటరుకు 20 పైసల చొప్పున చార్జీలు పెంచనున్నారు.

పెద్దగా ప్రభావం చూపదు..
చార్జీల పెంపుదల వల్ల సామాన్యులపై పెద్దగా ప్రభావం పడదని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి నెలా రూ.3.30 లక్షలు మాత్ర మే పెరగనున్నాయి. అదే సమయంలో పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీని రూ.10గా నిర్ణయించారు. గరిష్ట ధరను కూడా రూ.30 నుంచి రూ.35 వరకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.15 కనీస చార్జీగా వసూలు చేయనున్నారు. డీలక్స్‌ బస్సుల్లో రూ.20, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో రూ.25, రాజధాని బస్సు ల్లో రూ.35 కనీస చార్జీగా నిర్ణయించారు. ఈ మేర కు పెంచిన ధరలు ఆర్టీసీ అధికారులు టిమ్స్‌లో మార్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి వచ్చాయి.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...