మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపాలి


Mon,December 2, 2019 11:11 PM

-మున్సిపల్‌ ప్రత్యేకాధికారి వినోద్‌ కుమార్‌
లక్షెట్టిపేట : మొక్కల పెంపకం పై శ్రద్ధ వహించాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారి వినోద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణ మున్సిపల్‌ పరిధిలోని ‘గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020-2021’ లో భాగంగా మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు దచేసిన మొక్కల పెంపకం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ...కలెక్టర్‌ ఆదేశాలతో అన్ని మున్సిపాలిటీల్లో నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం నర్సరీ బెడ్ల ఏర్పాటు, సేంద్రియ ఎరువులు వాడే పద్ధతి, ఎర్రమట్టి, ఇసుకను విత్తనాలు మొలకెత్తే సమయంలో వినియోగించడంపై అవగాహన కల్పించారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 15095 మొక్కల్లో జామ, నిమ్మ, దానిమ్మ, మల్లె, గులాబీ, మామిడి, ఉసిరి, సపోటలను నర్సరీలో పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. వీటిని అన్ని వార్డుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో ఆయన వెంట మున్సిపల్‌ కమీషనర్‌ టీ.రాజలింగు, మెప్మా అధికారి శంకర్‌, మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్యలతో పాటు నర్సరీ పర్యవేక్షకులున్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...