రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Mon,December 2, 2019 11:10 PM

దండేపల్లి : రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అనీ, దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పంటలు పుష్కలంగా పండడంతో రైతుల కళ్లలో ఆనందం కనిస్తుందని చెప్పారు.

ఐకేపీ, సొసైటీల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతుల అకౌంట్‌లో డబ్బులు జమచేసే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలన్నారు. మద్ధతు ధర వరి ఏ గ్రేడ్‌-1835, బీగ్రేడ్‌-1815ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైసస జిల్లా కన్వీనర్‌ మోటపల్కుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ అనిల్‌కుమార్‌, సర్పంచ్‌లు అనవేణి ప్రేమళ, డాంక లక్ష్మణ్‌, ఎంపీటీసీ ముత్తె రాజన్న, పీఏసీఏస్‌ చైర్మన్‌ అక్కల రవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, ఐకేపీ ఏపీఎం ప్రవీణ్‌, నాయకులు బండారి మల్లేశ్‌, బోడ నర్సింగ్‌, రేని శ్రీనివాస్‌, కందుల అశోక్‌, నలిమెల మహేశ్‌, కొట్టె సత్తన్న, చీర్ల వెంకటేశ్వర్లు, సురేందర్‌, అఫ్సర్‌, బొమ్మెన మహేశ్‌, గడిపెల్లి సత్యం, పూదరి రమణయ్య, పిట్టల అశోక్‌, చొప్పదండి రమేశ్‌, మగ్గిడి శ్రీనివాస్‌, చిరంజీవి, అజయ్‌, లింగారెడ్డి, అనవేణి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...