నాణ్యమైన ధాన్యాన్ని తీసుకరావాలి


Thu,November 21, 2019 01:19 AM

జన్నారం : రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జేసీ సురేందర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని మొర్రిగూడ, దేవునిగూడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీపీఎం వేణుగోపాల్‌, ఎంపీఎం బుచ్చన్న, బుక్‌ కీపర్స్‌, ఐకేపీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
దండేపల్లి : వరి ధాన్యం పండించిన రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జేసీ వై సురేందర్‌రావు తెలిపారు. మండలంలోని మామిడిపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. 17 శాతానికి తేమ పెరగకుండా చూసుకోవాలని చెప్పారు. ధాన్యాన్ని కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా తూకం వేసి మిల్లు లకు తరలించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను వీఆర్వో పర్యవేక్షించాలన్నారు. ధాన్యం తూకమైన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద తాగు నీరు, నీడ వసతి కల్పించాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి(డీఎస్‌డీవో) వెంకటేశ్వర్లు, డీఎం గోపాల్‌, డీఆర్‌డీఏ డీపీఎం వేణు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ విజయ, ఏఈవో శరణ్య, వీఆర్వో ప్రభాకర్‌, సీఏ లింగన్న, నాయకులు ఎల్తపు సుభాష్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...